జైశ్రీరామ్.
63)
తల్లి తండ్రి గురువు దైవంబులగు మాకు - వారి వృత్తియందు నేరమున్న
నేర వృత్తి మాకు
నేర్పకే వచ్చుగా! - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా!
తల్లి, తండ్రి, గురువు,
వీరు మాకు దైవములే. అట్టి దేవులతో సమానమైన
వారి యొక్క వృత్తమునందు నేర ప్రవృత్తి యున్నచో ఆ నేర ప్రవృత్తి మాకునూ నేర్పకనే
వచ్చును కదా! కాబట్టి మాకు మార్గదర్శకులైన పెద్దలందు సత్
ప్రవృత్తియే యుండ వలెను కాని, నేర ప్రవృత్తి ఉండరాదు.
జైహింద్.
No comments:
Post a Comment