జైశ్రీరామ్.
65) నాది నీది
యనుచు వాదించి నేర్పుచు, - మాది మేము గొనగ మమ్ము తిట్టి
స్వార్థపరులటంచు పలుకుట
న్యాయమా? - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నవారిఁగా ఉన్నప్పుడు మీరు ఇది నాది, అది
నీది అంటూ మాతో వాదించి మాకు స్వార్థాన్ని మప్పుదురు. పెద్ద
అయిన పిదప మేమి ఇది మాది అంటూ తీసుకొన్నచో మమ్ములను మీరు స్వార్థపరులు మీరు అని
మమ్ములను నిందింతురు. ఇది మీకు న్యాయమేనా?
జైహింద్.
No comments:
Post a Comment