జైశ్రీరామ్.
57) చిన్ననాడు
మమ్ము మన్నన జేతురు - పెరుఁగుచున్న కొలది ప్రేమ తగ్గు
మన్నన కరువైన మాకెట్లు తోచును? - పెద్దలార! జ్ఞాన
వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులు ఎంతో మన్నిస్తూ ఎంతగానో ప్రేమ
కురిపిస్తారు. కాని మేము పెద్ద ఔతున్న కొద్దీ మాపై వారికి
ఉండే ప్రేమ తగ్గిపోతుందని మాకు అనిపిస్తుంది. ఏలనందురా!
చిన్నప్పుడు మమ్మల్ని వారు చూచినట్లుగా పెద్దైన కొద్దీ చూడరు.
ఆ విధముగా వారు చూపించే ప్రేమ తగ్గుచున్నచో మాకు కష్టముగా ఉండదా?
జైహింద్.
No comments:
Post a Comment