జైశ్రీరామ్.
67) చిన్నవారిమగుట నన్నియు తెలియక - తప్పుచేయుచుందుమొప్పనుకొని.
తప్పు తెలియఁ జిప్పి , దండింప మానుఁడీ.. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నపిల్లలమగుట చేత తెలియకపోయిన కారణముగా తప్పులనుకూడా చేయఁదగిన పనులుగానే భావించుట చేత ఆ తప్పులు చేస్తాము. అటువంటి సమయంలో మీరు మాకు ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసేలాగ చెప్పండి. అంతేకాని మమ్మల్ని శిక్షించడం మీకు తగదు.
జైహింద్.
No comments:
Post a Comment