జైశ్రీరామ్
55) చెత్తపనులు మేము చేయుట చూచినా - తల్లి చెప్పఁ బోదు తండ్రికెపుడు.
తండ్రి కన్న తల్లి దయఁ జూచి రక్షించు. - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చిన్నతనము కారణముగా మేము పాడు పనులు చేస్తున్నా కాని తల్లి చూచినప్పటికీ తండ్రికి చెప్పదు. తండ్రి కన్నా తల్లి పిల్లలను దయతో చూచుచు రక్షించుచుండును. అమ్మకు మాపై అంతటి ప్రేమ ఉంటుంది.
జైహింద్
No comments:
Post a Comment