Sunday, January 7, 2018

బాల భావన. 77వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
77) తల్లి చేతి ముద్ద పిల్లలకనురాగ  బంధమరయఁ జేయు, బ్రతుకఁ జేయు.
     తల్లి ప్రేమ కొలుపు మల్లెల మనసునుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! తల్లి చేతితో పెట్టే భోజనము పిల్లలకు ప్రేమ బంధమును తెలియఁ జేయును. బ్రతుకునట్లు చేయును. తల్లి ప్రేమ మాలో మల్లెల వంటి మనసును కలుగఁ జేయును.
జైహింద్.

1 comment:

Unknown said...

quote words
https://goo.gl/Ag4XhH
plz watch our channel