Friday, January 5, 2018

బాల భావన. 76వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
76) ఎవరి శక్తి నెన్న నెవరికి సాధ్యముబాలలందు శక్తి ప్రబలకున్నె?
     శోధనమున భావి మేధావులము మేము  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! ఎవరి యొక్క అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యముల నెవరు గుర్తించఁ గలరు? బాలలలో కూడా శక్తి ప్రబలి ఉండునని తెలుసుకొన వలెను. భావి కాలమున పరిశోధనలను చేయు మేధావులము మేమే కదా!
జైహింద్..

1 comment:

Unknown said...

nice devotional story
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel