Friday, December 22, 2017

బాల భావన. 73వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

  జైశ్రీరామ్.
73) పెద్దవారి నడుమ పిల్లలమగు మేము   చెప్పు మాట వినరు. తప్పనుదురు.
     మమ్ము చెప్పనిండు. మా మాటవినుఁడయ్య  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మీరు మాటలాడుకొనుచున్నప్పుడు మేము ఆ మాటలు విని స్పందించి మా అభిప్రాయమును చెప్పుటకు ఉత్సహిస్తున్నప్పుడు మమ్మల్ని మీరు అడ్డుకొని, అలా మధ్యలో మాటాడ కూడదు, తప్పు అని మా నోరు నొక్కివేతురు. మమ్మల్ని కూడా మా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి. మా మాట కూడా కొంచెం వినండి..
జైహింద్.

Thursday, December 21, 2017

బాల భావన. 72వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

  జైశ్రీరామ్.
72) ఆడుకొనెడి మమ్మునల్లరి యని తిట్టి  చేయనీరు. మాదు చేవఁ గనరు.
     ఆట పాటలొసగు నద్భుత మేధనుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము ఆడుకొనే సమయమున మమ్ములను చూచి మీరు అల్లరి చేస్తున్నారేమిటి అని తిట్టుచుందురు. మమ్ములను ఆడుకోనివ్వరు. మీరు ఏ  ఆట పాటలను అల్లరి అంటున్నారో ఆ ఆట పాటలు మాకు అద్భుతమైన మేధా సంత్తిని కలుఁగఁ జేయును.
జైహింద్.

Tuesday, December 19, 2017

బాల భావన. 71వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్.
71) మీరు చదివి చెప్ప మేలగు కొంచెమేమేము చదివి నేర్వ మేలు హెచ్చు.
    మమ్ము చేయనిండు మా మేధ గాంచుడుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!
                    

భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మా కొఱకు మీరే చదువుతూ, మాకు బోధించుతూ ఉన్నట్లైతే ఫలితము కొంచెం మాత్రమే ఉంటుంది. అదే మీరు మమ్మల్ని చదవి చెప్పమనినచో మా మేధా శక్తి మీకు తెలియును.
జైహింద్.

Monday, December 18, 2017

బాల భావన. 70వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్. 

70) పుస్థకంబు చదివి ముక్కున పెట్టిన  -  ఫలితమెట్టుండుభావి యెటుల?
     నిండు మదిని చదువనిండుమమ్మిచ్ఛతో.  -  పెద్దలారజ్ఞాన వృద్ధులార!

భావముజ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! పుస్తకమును చదివి మేము ముక్కున పెట్టుకొనినచో ఫలితం ఏవిధంగా ఉంటుందిభవిత ఎట్టులుండును?  మమ్ములను నిండు మనసుతో మనస్పూర్తిగా చదువనిండుభవిత బాగుండును.


జైహింద్.

బాల భావన. 69వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్. 
69) పాఠశాలలోన బలవంత పెట్టుచు  -  చదువు నేర్ప, మాకు చదువు రాదు.
     నిజము చెప్ప మమ్ము నిలఁబెట్టి దండింత్రు.  -  పెద్దలారజ్ఞాన వృద్ధులార!

భావముజ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! బడిలో మాకు ఇష్టము లేని సమయమున ఉపాధ్యాయులు బోధింప యత్నించినచో మేము మా మనసులో ఉన్న యీ అభిప్రాయమును చెప్పినచో  వారు మమ్ము వారిని ఎదిరిస్తున్నామంటూ నిలపెట్టి దండిస్తారుఈ విధముగ చేయుట ధర్మమా?

జైహింద్.

Sunday, December 17, 2017

బాల భావన. 68వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు

జైశ్రీరామ్.
68) పాఠశాలలోన పదిమందితో పాటు   అచటనున్నవాటినరయుదుమయ.
     మంచి చెడ్డలుండు. మన్నింపవలె మీరుపెద్దలార! జ్ఞాన వృద్ధులార!


భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము బడిలో పదిమందితో కలిసి మసలుచున్నందున అక్కడి విషయములను అందరితో పాటు మేమూ నేర్చుకొందుముఅట్లు నేర్చుకొనువాటిలో మంచివిషయములుండ వచ్చును, వాటితో పాటు చెడ్డ విషయములు కూడా ఉండ వచ్చును. ఆట్టి సమయమందు ఆ చెడ్డ మాలో చోటు చేసుకొన్నదని మీరు గ్రహించినచో మమ్ములను మన్నించి, ఆ చెడును గురించి మాకు చెప్పి, మమ్ములను మంచి మార్గమున మీరు నడిపించ వలెను.
జైహింద్.

Saturday, December 16, 2017

బాల భావన. 67వ పద్యము. రచన. .. .. .. చింతా రామ కృష్ణా రావు.

 జైశ్రీరామ్. 
67) చిన్నవారిమగుట నన్నియు తెలియక   -  తప్పుచేయుచుందుమొప్పనుకొని.
     తప్పు తెలియఁ జిప్పి దండింప మానుఁడీ..  -  పెద్దలారజ్ఞాన వృద్ధులార!

భావముజ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మేము చిన్నపిల్లలమగుట చేత తెలియకపోయిన కారణముగా తప్పులనుకూడా చేయఁదగిన పనులుగానే భావించుట చేత ఆ తప్పులు చేస్తాముఅటువంటి సమయంలో మీరు మాకు ఇది తప్పుఇది ఒప్పు అని తెలిసేలాగ చెప్పండిఅంతేకాని మమ్మల్ని శిక్షించడం మీకు తగదు.
జైహింద్.