Saturday, October 24, 2026

గంగా జంగమ సంవాదం ... రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

గంగా జంగమ సంవాదం

                 ================


                                                రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                            జుత్తాడ,

1.కం:-అటు నిటు నట నకు! జట లిటు 

         లటు!నిట లాక్షు లలన!--లాలీ లోలన్!

         అటు జట ముడి!శశి గని!

        కట కట నెటు జారె దనుచు!---గంగమ!జడియన్?


జటముడి శశి=చంద్ర శేఖరుడు


2.కం:-.జడు పేలను?యెల నాగరొ?

          వడి వడి నేలను పడు టది--!ప్రజ!భుక్తి డుటే?

         చెడుగని బెగలకు!గంగమ!

         సిడి ముడి వలదిక!జగతికి!---చేదో డగుమా!!


       సిడి ముడి=కోపము,ప్జ భుక్తిడుటే=నీరు పారిన పంట పండి 

ప్రజల కాహారమునిచ్చుటయే గదా,


3.కం:-నడు వడి!జగములు సరి నడ!

        నిడుపగు నాట్యము!వలయును!నిరుపమ సఖియా!

       బుడి బుడి నడకల!హొయలుతొ!

       జడియక!నిల నడ! శుభమగు--చరి తార్ధ కమై!!


జగములు సరి నడ=లోకములు క్రమ బద్ధముగా మనుటకు,


4.కం:-జగముల బ్రోవగ!గరళము!

         వగవక!గళమున నిడు కొని--బరగితి!గాదే?

         భుగలిడు నగ్ని నయన మున!

         సెగలకు!జడియని!శివుడను!---శివ మగు నీకున్!!


5.కం:-పుడిమి యొడి లోని! లాలన!

         బెగులుల కెడమగు!వనితరొ!--విడియను!నిన్నున్!

        జడుపేల?సిరుల పంటలు!

        వడి వడి బ్రోవగ వలె? జను!---వాదిలె దేలన్?!.


విడియను నిన్నున్=నిన్ను పూర్తిగా విడువను సుమా!(నీతో

 పూర్తి తెగ తెంపులు చేసి చేసికోను,


6.కం:-ఢమరుక మ్రోతల స్వరములు!

          నమకము చమకము!స్వరితము---నాట్యోద్భటులన్!

         సుమ సౌరభ మేర్ప డగను!

         సుముఖత తేర్చితి! పదపడి!---సుందరి గంటే?!


7.కం;-వెలి బూదిని మేన పులిమి!

         తెలియగ!తుది బూ దనుచును!---దీక్షాశ్రితునై!

         కలికాలము!నాగ మనగ!

        వెలి మెడ కును!నాగునిడితి!---వెలదిరొ?గనుమా!!


వెలి మెడ=తెల్లటి మెడకు


8.కం:-పిలిచిన వెంటనె!పలికెదు!

         తలచిన కష్టాలు దీర్చి---తనియుదు!జగమున్!

         వెలగల!విలువల!ఱేడును!

         లలనా!నీవాడ!హరుడ!---లాలించు!భువిన్!!


9.కం;-విష నాగుల!జగ తిది! యని

         విష నాగము దాల్చినాడ!వినుమా!గంగా!

         కృషి భిక్షాటన జీవన!

         వృషభా రూఢత, శ్రమతకు---విజయ మనంగన్?!.

జైహింద్.

No comments: