Monday, July 1, 2024

పదియు, నైదు, నైదు, పదునైదు, పదునైదు, .. చెప్పుకోడి చూద్దాం.

 జైశ్రీరామ్.

వింత ఆశీర్వాద పద్యం

ఆ.వె.  పదియు, నైదు, నైదు, పదునైదు, పదునైదు, 

ఇరువదైదు, నూట యిరువదైదు, 

ఎలమి మూడు నూరు, లిన్నూరు, మున్నూరు, 

తలలవాడు మిమ్ము ధన్యు జేయు.

వివరణము.

పదియు, నైదు, నైదు, పదునైదు, పదునైదు,

15 2 - 10 + 5 + 5 +15 +15 = 50

ఇరువదైదు, నూట యిరువదైదు,

25 2 - 25 + 125 = 150

ఎలమి మూడు నూరు, లిన్నూరు, మున్నూరు,

35 2 - 300 + 200 + 300 = 800

2 = 50 + 150 + 800 = 1000

వేయి తలలవాడు మిమ్ములను ధన్యుల చేస్తాడు. వేయి తలలున్న ఆయన ఎవరు?

ఆదిశేషుఁడు. మిమ్ములను రక్షించు గాక.

జైహింద్.

No comments: