Tuesday, May 9, 2023

మాగాయ పచ్చడి మాహాత్మ్యము..

జైశ్రీరామ్.

మాగాయ పచ్చడి మాహాత్మ్యము..

మాగాయ అంటే మామిడి కాయ. అపక్వ చూతఫలము. దానితో చేసే ఒఅక విధమయిన పచ్చడిని మాగాయ పచ్చడి అంటారు. దాని రుచి అద్భుతమనే చెప్పాలి. ఈ పచ్చడి అనారోగ్యముగా ఉన్నవారికి, బాలెంతలకూ కూడా పత్యంగా పెట్టుట మనలు పూర్వమునుండీ యున్నది. జ్వరపీడితులు అరుచి పోవడానికి ఈ పచ్చడిని చప్పరించుట నేను చూచాను.

దాని గొప్పదనం ఉత్పల మాలలో....

 గాయకులందు దివ్యమగు కమ్మని పాట అదెట్లువచ్చు? స 

న్నాయకులందు వాక్ప్రభ ఘనంబుగ ఎట్టుల వచ్చుచుండు? సు

జ్ఞేయముగాగ భోదనలు జీయరులెట్లు  వచింత్రు? వారు "మా 

గాయ భుజించుచుండుటనె"  కారణమిద్దియె  వారివృద్ధికిన్

జైహింద్.

No comments: