జైశ్రీరామ్.
25) పాఠశాలలోన
వ్రాసెడి పని పెంచి - చదువ సమయ మీక వ్యధను పెంచ
చదువు ధ్యాస మాకు చచ్చిపోవును
కదా! - పెద్దలార! జ్ఞాన వృద్ధులార!
భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! మాకు బడులలో వ్రాతపనే ఎక్కువగా ఇస్తున్నందువల్ల చదువుకోడానికి తగిన సమయం
ఇవ్వటం లేదు. ఈ కారణంగా మాకు చదువుమీద ధ్యాస తగ్గిపోతోందని
మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
జైహింద్.