జైశ్రీరామ్.
శ్లో. భాషాసు ముఖ్యా మధురా - దివ్యా గీర్వాణ భారతీ|
తస్యాం హి కావ్యం మధురం - తస్మాదపి సుభాషితం ||
తే.గీ. సంస్కృతము దివ్య భవ్య భాష మధురమిల
నగును భాషలన్నిటనెన్న, నందు కూడ
మధురమైనది కావ్యము, సుధలుచిలుకు
సూక్తి ఘనమింతకన్నను సుజనులార!
భావము. భాషలన్నిటిలోనూ ముఖ్యమైనది, తీయనిది, దివ్యమైనది.
గీర్వాణ భారతి అనగా సంస్కృత భాష. అందులోకూడా కావ్యం మధురమైనది.
దాని కంటెనూ కూడా సుభాషితం మధురమైనది.
జైహింద్.
No comments:
Post a Comment