Sunday, April 14, 2024

పద్యసారస్వత పీఠం తెలంగాణ ll క్రోధి ఉగాది వేడుకలు ll శత పద్య కవి సమ్మేళనం... నిర్వహణ .. అష్టావధాని శ్రీ అవుశులభానుప్రకాశ్.

ఆద్యంతము అవధాని అవుశుల భానుప్రకాశ్ చాలా సమర్ధవంతంగా నిరాఘాటంగా నిర్వహించి తనకుగల సామర్ధ్యాన్ని కనబరిచేరనుటలో సందేహం లేదు.
వీరి తల్లిదండ్రులను చూచే భాగ్యం ఈ సభకారణంగా మాకు లభించుట విశేషం.
ఆ జగన్మాత వీరిని చక్కగా కాపాడుతూ జగత్కల్యాణ కారకుఁడుగా నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాను..
అవధాని భానుప్రకాశ్ కు నా అభినందనలు.
ఈ సభకు సమయానికి నేను చేరుకోలేకపోయినా నేను వ్రాసిన కవిత ఇక్కడ ప్రకటిస్తున్నాను.
నా కవిత.
౧) శా.  శ్రీరామాయణ భాను తేజ మగుచున్, శ్రీమంత సత్ క్రోధి! ర
మ్మోరమ్యాక్షర దివ్యరూప! ద్యుమణీ! యుత్సాహమొప్పారగా,
ధీరాత్ముల్, కవి పండితుల్, సుజనులున్, నిత్యంబు భావించుచున్
శ్రీ రమ్యాక్షర వత్సరంబుగ నినున్ జిత్తంబులన్ గొల్వగాన్.

౨) ఉ.  శ్రీ స్వగుణానుబంధ వర చిత్ర కవిత్వ విధాన పద్య సా
రస్వత పీఠ తేజమయి రమ్ము కృపన్ గన మమ్ము క్రోధి! తే
జస్వినివై నిరంతరము చక్కిని తెల్గు కవిత్వ తత్త్వ స్రో
తస్వినిగా చెలంగుమిల, ధర్మప్రవృత్తి వివృద్ధి చేయుచున్.

౩) ఉ.  మంగళమౌత భానునకు, మంగముల్ శుభక్రోధికిన్, సదా
మంగళమౌకవీశులకు, మంగళమౌ నిల సజ్జనాళికిన్,
మంగళమౌత హిందువుల మంగళ భావన పాళి కెల్లెడన్,
మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.
జైహింద్.

Avadhani mailavarapu muralikrushna program bhaktisadhanam

జైశ్రీరామ్.
జైహింద్.

సాహిత్య అంశపూరణలు ... భక్తిసాధనం.

జైశ్రీరామ్.
జైహింద్

Thursday, April 4, 2024

క్రోధి ఉగాది వేడుకలు.



 

హైటెక్స్ దగ్గర అన్నమయ్యపురంలో సుసర్ల సుధన్వ అష్టావధానం 3/4/24

హైటెక్స్ దగ్గర అన్నమయ్యపురంలో

సుసర్ల సుధన్వ అష్టావధానం
3/4/24

సభా సంచాలకులు.. శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ శర్మ, 
హైకోర్టు న్యాయవాది, 
9246531895
ప్రాశ్నికులు
నిషిద్ధాక్షరి.. 'అవధాన రాజహంస 'శ్రీ ముద్దు రాజయ్య, అష్టావధాని, 
7330963281
సమస్య.. 'పద్యకళా ప్రవీణ'డా. ఆచార్య ఫణీంద్ర, అధ్యక్షులు, యువభారతి, 
 99598 82963
దత్తపది... డా. లలితవాణి, విశ్రాంత ప్రధానాచార్యులు,
9849026107
వర్ణన.... 'పూర్ణ ప్రజ్ఞ' శ్రీ చంద్ర శేఖర్
న్యస్తాక్షరి..శ్రీ కటకం వెంకటరామశర్మ , విశ్రాంత మండలవిద్యాశాఖాధికారి
9440472321
ఛందోభాషణ...'చిత్రకవి సమ్రాట్' శ్రీచింతా రామకృష్ణారావు, 
82473 84165
ఆశువు...  శ్రీమతి గజవెల్లి శారద, ప్రధానోపాధ్యాయురాలు 
99495 04310
అప్రస్తుత ప్రసంగం... శ్రీ పంతుల వేంకటేశ్వర రావు, పద్యకవి, నటులు
99083 44249

ఆ సభలో.
నా పద్యాలు.
ఉ.  శ్రీరమణీసమేతుఁడగు శ్రీహరి, వాణియు, బ్రహ్మయున్, జగత్
కారణమైన శాంభవియు, కామునివైరియు కావుతన్ నినున్,
ధారణమందు బ్రాహ్మివలె ధాత్రి సుసర్ల సుధన్వ! వెల్గుమా!
భారతి సద్వధాన మన భాసిలు నీసభ మెచ్చ నందరున్.👍🏼

ఉ.  స్తుతుఁడౌ శ్రీహరియా యనంగ, భువి సంతోషంబునే బంచు, నా 
శ్రితులన్ గాచెడి జ్ఞానపూర్ణులగు నీ సిద్ధేశ్వరానందభా
రతికిన్ వందనముల్ రచింతు, గొనుగా, ప్రఖ్యాతిగా ధాత్రి సం
తతమున్ శోభిలఁ జేయఁ గోరుచునిటన్ దత్త్వార్థ తేజస్వికిన్.🙏🏻

శా.  ఆనందాక్షర భారతిన్  దలతు రమ్యానంద శోభాకృతిన్,
జ్ఞానంబున్ వికసింపఁ జేసి, కడకున్ గమ్యంబునే జేర్చగా
నీ నా భేదవిదూర భావ విలసన్ నిక్షేపమున్ నామదిన్
మౌనోద్భాసిత మూర్తిగా నిలుపగా  మాతృప్రభన్ గోరెదన్.🙏🏻