Wednesday, October 22, 2008

ఒక కంద పద్యం లో ఒకటా రెండా మూడా కాదు, నాలుగు కంద పద్యాలు.

కందంలో కందం, అందులోనే మరో కందం, మరో కందం కూడా. చూడాలనుందా? ఐతే యీ క్రింది పద్యాన్ని గమనించండి.
క:- శంకర! ఉమాధిపా! వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా!
సంకటము బాపి, కృప గన
నింకన్ శరణంబు వేడ నేలవు. భరమా? ఇది 1 వ కందపద్యము.

క:-కరుణార్ద్ర హృదయ! అభవా!
జిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్
శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా! ఇది 2 వ కనద పద్యము.

క:-సంకటము బాపి కృపగన
నింకన్ శరనంబు వేడ నేలవు. భరమా?
శంకర్! ఉమాధిప!వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా! ఇది 3 వ కంద పద్యము.

క:-శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా!
కరుణార్ద్ర హ్ర్దయ! అభవా!
గిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్. ఇది 4 వ కంద పద్యము.

చూచారుకదా! తమాషాగాలేదూ? ప్రయత్నం చేయాలేకాని బోలెడన్ని తమాషాలు చేయవచ్చు. ఐతే మీ వుత్సాహాన్ని తెలుసుకొన్న తరువాతే మరి కొన్ని విషయాల్ని గూర్చి తెలియ జేసే ప్రయత్నం చేయగలను. జై హింద్.

No comments: