జైశ్రీరామ్.
శ్రీమతి డా. మలయవాసిని గారికి జగన్మాత ఆశీస్సులు.
అనేక కంద గీత గర్భ చంపక మాల.
👇🏼
వర గుణదాంబరో! మలయ వాసిని! మీకు నమస్కరింతు, శ్రీ
కర ప్రణవాక్షరా! సుజన గణ్య నయాన్విత శుభ్రతేజమా!
స్థిర వినయాకృతీ! శుభగతిన్ గని దైవము శోభగొల్పుగా
పర వినుతా! సదా సుఖము వర్ధన చేయు ప్రచోదనంబెదన్.
చంపక గర్భస్థ కందము 1.
👇🏼
గుణదాంబరో! మలయ వా
సిని! మీకు నమస్కరింతు, శ్రీకర ప్రణవా!
వినయాకృతీ! శుభగతిన్
గని దైవము శోభగొల్పుగాపర వినుతా!
చంపక గర్భస్థ కందము 2.
👇🏼
ప్రణవాక్షరా! సుజన గ
ణ్య నయాన్విత శుభ్రతేజమా!స్థిర వినయా
వినుతా! సదా సుఖము వ
ర్ధన చేయు ప్రచోదనంబెదన్.వర గుణదా!
చంపక గర్భస్థ కందము 3.
👇🏼
వినయాకృతీ! శుభగతిన్
గని దైవము శోభగొల్పుగాపర వినుతా!
గుణదాంబరో! మలయ వా
సిని! మీకు నమస్కరింతు, శ్రీకర ప్రణవా!
చంపక గర్భస్థ కందము 4.
👇🏼
వినుతా! సదా సుఖము వ
ర్ధన చేయు ప్రచోదనంబెదన్వర గుణదా!
ప్రణవాక్షరా! సుజన గ
ణ్య నయాన్విత శుభ్రతేజమా!స్థిర వినయా!
🙏🏽
అభినందనలతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.