Thursday, September 29, 2022

లలితామృతము. మంగళమహాశ్రీ.

జైశ్రీరామ్.

మంగళమహాశ్రీ.

శ్రీలలిత చిత్తమున చెన్నలర నుండినను చిత్ర కవితామృతము చిందున్

బాలగను భక్తులకు చాలగను సంతసము పంచుటకు తానుగనె వచ్చున్,

కాలగతి తానగుచు కన్బడుచు కన్నులకు, కమ్మగవరమ్ములనె యిచ్చున్,

జాలి కల శ్రీ లలిత సజ్జనుల చిత్తముల చక్కనగు రూపమున నిల్చున్.

జైహింద్,