పురము హితమును కోరెడు పుణ్యమూర్తి
మనకు మాధవునకు గూర్చు మధ్యవర్తి
సకల వైదిక కర్మల చక్రవర్తి
మన పురోహితు మన్నించ మనకు కీర్తి.
రచన.
శ్రీ మిస్సన్న.
నా స్పందన.
అతులిత భావనా గరిమ నద్భుత రీతిని మీరు సత్ పురో
హితుని వచించినారలు? మహేంద్రునికైనను పూజనీయుడీ
క్షితిని పురోహితుండు. పరికించగ మీ మహనీయ పద్య స
ద్గతి ప్రముదావహంబు, వినుతంబును మిస్సన మిత్ర పుంగవా!
హితుని వచించినారలు? మహేంద్రునికైనను పూజనీయుడీ
క్షితిని పురోహితుండు. పరికించగ మీ మహనీయ పద్య స
ద్గతి ప్రముదావహంబు, వినుతంబును మిస్సన మిత్ర పుంగవా!
జైహింద్.