జైశ్రీరామ్.
విభూతి, హంసయాన(తూణకము,సుగంధి),పంచచామర,సుగంధి**గర్భ శ్రీగంధినీ వృత్తము
శ్రీ శివాని సత్కృపన్ బ్రసిద్ధిఁ జెంద వింతయా ధరన్ సుభక్తితో
శ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్ సదా ప్రమోదమై
శ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగాఁ గృతుల్ సుఖమ్ముగా
శ్రీ శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్ నిజమ్ముగా
శ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్ సదా ప్రమోదమై
శ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగాఁ గృతుల్ సుఖమ్ముగా
శ్రీ శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్ నిజమ్ముగా
విభూతి (చామరము )
శ్రీ శివాని సత్కృపన్
శ్రీ శివాని పల్కునే
శ్రీ శివాఖ్యుడెంచఁగా
శ్రీ శివానికిత్తు జేల్
శ్రీ శివాని పల్కునే
శ్రీ శివాఖ్యుడెంచఁగా
శ్రీ శివానికిత్తు జేల్
హంసయాన (తూణకము, సుగంధి)
శ్రీ శివాని సత్కృపన్ బ్రసిద్ధిఁ జెంద వింతయా
శ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్
శ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీ కరమ్ముగా
శ్రీ శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రిగా
శ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్
శ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీ కరమ్ముగా
శ్రీ శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రిగా
పంచచామరము
శివాని సత్కృపన్ బ్రసిద్ధిఁ జెంద వింతయా ధరన్
శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్ సదా
శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగాఁ గృతుల్
శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్
శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్ సదా
శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగాఁ గృతుల్
శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్
సుగంధి**
శ్రీ శివాని సత్కృపన్ బ్రసిద్ధిఁ జెంద వింతయా ధరన్
శ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్ సదా
శ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగా గృతుల్
శ్రీ శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్
శ్రీ శివాని పల్కునే వచించి చిత్రమౌగతిన్ సదా
శ్రీ శివాఖ్యుడెంచఁగా రచించి శ్రీకరమ్ముగా గృతుల్
శ్రీ శివానికిత్తు జేల్ విశిష్ట సిద్ధి దాత్రి గావునన్
సుప్రభ
వృత్తము -- గణములు -- యతి -- ఛందము
శ్రీగంధినీ --ర,జ,ర,జ,ర,జ,ర - 11 -- ప్రకృతి
విభూతి( చామరము) -- ర,జ,గ -------యతిలేదు -- ఉష్ణిక్
హంసయాన(తూణకము,సుగంధి)-ర,జ,ర,జ,ర(7హ గణములు,గురువు)-9-అతిశక్వరీ
పంచచామరము -- జ,ర,జ,ర,జ,గ --- 10 -- అష్టీ
సుగంధి** ---ర,జ,ర,జ,ర,లగ ( 8 హ గణములు, గురువు) --11 -- అత్యష్టీ
(హంసయాన గా పేర్కొనబడినది మనకందరకు సుపరిచితమైనది, 7 హ గణములు, గురువుుతో 15 అక్షరములు కలిగిన సుగంధి వృత్తము.
రెండవది ** గుర్తులు బెట్టిన సుగంధి-- వేరే ఛందమునకు సంబంధించినది 8 హగణములు, గురువుతో 17 అక్షరములతో నున్నది.)
రెండవది ** గుర్తులు బెట్టిన సుగంధి-- వేరే ఛందమునకు సంబంధించినది 8 హగణములు, గురువుతో 17 అక్షరములతో నున్నది.)
చింతావారి బ్లాగ్ ఆంధ్రామృతములో ప్రచురింపబడినది, వల్లభ వఝల వారిచే రచింపబడిన "విభూతి, హంసయాన(తూణకము,సుగంధి),పంచచామర,సుగంధి**గర్భ శ్రీగంధినీ వృత్తము"ను జూచి దాని స్ఫూర్తితో యత్నించినది. క్రొత్త క్రొత్తవి ప్రచురిస్తూ ఉత్సాహమును గలిగిస్తున్న వారిద్దఱకు ధన్యవాదములు. లోనుండి తోచిన రీతిలో దీవించే శక్తికి ప్రణామములు.
జైహింద్.