Friday, February 28, 2025

రాజిత,పూజిత,వాజపేయ,మనోజ్ఞ,వామదేవ.నీవన,చేరని,వీక్షితా,శేఖరా.పుణ్య దాయి,భీమజాలు.రక్షమాం.శాంకరీ.పోషిత, గర్భ"-కౌముది"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్. 
రాజితా మనోహరా!శివా!రామణీయ భావ పుంజమా!రక్షమాం!చంద్ర శేఖరా!
పూజితా భవాబ్ది తారకా!భూమనోజ్ఞ భూతి దా మనా!పోక్షకాహార మీ గదే!
వాజపేయ పుణ్య దాయకా!వామ దేవ శాంకరీ ప్రియా!పక్షమం దంబ నిల్పితే!
బీజ సృష్టి నీమహాత్మ్యమే!భీమజాలు చేరనీకుమా!వీక్షితా మోద కౌముదీ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు 26,అక్షరము
లుండును,యతులు,10,19,అక్షరములకు చెల్లును,

పక్షము=శరీర మందర్ధ భాగము,

1,గర్భగత"-రాజిత"-వృత్తము,

రాజితా!మనోహరా!శివా!
పూజితా!భవాబ్ది తారకా!
వాజపేయ పుణ్య దాయకా!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-పూజిత"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!
భూ మనోజ్ఞ భూతిదా మనా!
వామ దేవ శాంకరీ!ప్రియా!
భీమజాలు చేర నీకుమా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లండును,

3,గర్భగత"-వాజపేయ"-వృత్తము,

రక్షమాం!చంద్ర శేఖరా!
పో క్ష కాహార మీ గదే!
పక్ష మం దంబ నిల్పితే!
వీక్షి తామోద కౌముదీ!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

4,గర్భగత"-మనోజ్ఞ"-వృత్తము,

రాజితా!మనోహరా!శివా!రామణీయ భావ పుంజమా!
పూజితా!భవాబ్ది తారకా!భూ మనోజ్ఞ భూతి దా మనా!
వాజపేయ పుణ్య దాయకా!వామ దేవ!శాంకరీ ప్రియా!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!భీమజాలు చేర నీకుమా!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,


5' గర్భ గత"-వామదేవ"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!రాజితా!మనో హరా!శివా!
భూ మనోజ్ఞ భూతి  దామనా!పూజితా!భవాబ్ది తారకా!. 
వామ దేవ శాంకరీ ప్రియా!వాజపేయ పుణ్య దాయకా!
భీమ జాలు చేర నీకుమా!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి,19,వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"-నీ వన"-వృత్తము,

రాజితా!మనో హరా!శివా!రక్ష మాం!చంద్ర శేఖరా!
పూజితా!భవాబ్ది తారకా!పోక్ష కాహార మీ గదే!
వాజపేయ పుణ్య దాయకా!పక్షమం దంబ నిల్పితే!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!వీక్షి తామోద కౌముదీ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,,వ యక్షరము నకు చెల్లును,

7.గర్భగత"-చేరని"-వృత్తము,

రక్ష మాం చంద్ర శేఖరా!రాజితా!మనోహరా!శివా!
పోక్ష కాహార మీగదే!పూజితా!భవాబ్ది తారకా!
పక్ష మందంబ నిల్పితే!వాజపేయ పుణ్య దాయకా!
వీక్షితా మోద కౌముదీ!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-వీక్షితా"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!రక్ష మాం !చంద్ర శేఖరా!
భూ మనోజ్ఞ భూతి దా మనా!పోక్ష కాహార మీగదే!
వామ దేవ శాంకరీ ప్రియా!పక్ష మందంబ నిల్పితే!
భీమజాలు చేర నీకుమా!వీక్షి తామోద కౌముదీ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-శేఖరా"-వృత్తము,

రక్ష మాం!చంద్ర శేఖరా!రామణీయ భావ పుంజమా!
పోక్ష కాహార మీగదే!భూ మనోజ్ఞ భూతి దా మనా!
పక్ష మందంబ నిల్పితే!వామ దేవ శాంకరీ  ప్రీయా!అం
వీక్షి తా మోద కౌముదీ!భీమ జాలు చేర నీకుమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు ,17,అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"-పుణ్య దాయి"-వృత్తము,

రామణీయ భావపుంజమా!రాజితా!మనోహరా!శివా!రక్ష మాం!చంద్ర శేఖరా!
భూ మనోజ్ఞ భూతి దా మనా!పూజితా!భవాబ్ది తారకా!పోక్ష కాహార మీగదే!
వామ దేవ శాంకరీ ప్రియా!వాజపేయ పుణ్య దాయకా!పక్ష మందంబ నిల్పితే!
భీమజాలు చేర నీకుమా!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!వీక్షి తామోద కౌముదీ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-భీమజాలు"-వృత్తము,

రాజితా!మనోహరా!శివా! రక్షమాం!చంద్ర శేఖరా! రామణీయ భావ పుంజమా!
పూజితా!భవాబ్ది తారకా!పోక్ష కాహార మీగదే!భూ మనోజ్ఞ భూతి దా మనా!
వాజపేయ పుణ్య దాయకా!పక్షమం దంబ నిల్పితే!వామ దేవ శాంకరీ ప్రియా!
బీజ సృష్టి నీ మహాత్మ్యమే!వీక్షితామోద కౌముదీ!భీమజాలు చేర నీకుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-రక్షమాం"-వృత్తము,

రక్షమాం!చంద్ర శేఖరా!రాజితా!మనోహరా!శివా!రామణీయ భావ పుంజమా!
పొక్ష కాహార మీగదే!పూజితా!భవాబ్ది తారకా!భూ మనోజ్ఞ భూతి దా మనా!
పక్ష మందంబ నిల్పితే!వాజపేయ పుణ్య దాయకా!వామ దేవ శాంకరీ ప్రియా!
వీక్షి తామోద కొముదీ!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!భీమజాలు చేర నీకుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13.,గర్భగత"-శాంకరీ"-వృత్తము,

రామణీయ భావ పుంజమా!రక్షమాం!చంద్ర శేఖరా!రాజితా!మనోహరా!
భూ మనోజ్ఞ భూతిదా మనా!పోక్ష కాహార మీగదే!పూజితా భవాబ్ది తారకా!
వామ దేవ శాంకరీ ప్రియా!పక్షమం దంబ నిల్పితే!వాజపేయ పుణ్య దాయకా!
భీమజాలు చేర నీకుమా!వీక్షి తామోద కౌముదీ!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-పోషిత"-వృత్తము,

రక్షమాం!చంద్ర శేఖరా!రామణీయ భావ పుంజమా!రాజితా!మనోహరా!శివా!
పోక్ష కాహార మీగదే!భూ మనోజ్ఞ భూతి దా మనా!పూజితా!భవాబ్ది తారకా!
పక్ష మందంబ నిల్పితే!వామ దేవ శాంకరీ ప్రియా!వాజపేయ పుణ్య దాయకా!
వీక్షి తామెద కౌముదీ!భీమజాలు చేర నీకుమా!బీజ సృష్టి నీ మహాత్మ్యమే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

 జైహింద్.

No comments: