Friday, February 28, 2025

లింగ,సదాశివా,జగద్రక్ష,భూతి లేపనా,భక్త చింతనా,శోభిత,తటపట,ధీరజా,నిరామయా,స్ఫుర ద్రూప,పదాశ్రి,వరదాంగ,ప్రభవాంగ,జగత్పోష,గర్భ"పరంతపా"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

స్ఫటిక లింగ మల్లి నాధ!సదా శివా!పరంతపా!జగద్రక్ష భూతి లేపనా!
జటల గంగ నాట్య లోల!సదామయా!విభూతిదా!జగత్పోష!శోభ ధీరజా!
నిటల నేత్ర పార్వతీశ!నిధానతం!శుభామయా!నిగమ్యంపు గమ్య మీవయా!
తట పటేల?గావ రావె!దదామి భోగ భాగ్యముల్!తగన్నీవు వీర ధీరమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి,యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు, పాదమునకు"26"అక్షరము
లుండును,యతులు"10,18,అక్షరములకు చెల్లును,

1,గర్భగత"-లింగ"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లినాథ!
జటల గంగ నాట్య లోల!
నిటల నేత్ర పార్వతీశ!
తటపటేల?గావ రావె!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2.గర్భగత"-సదాశివ"-వృత్తము,

సదా శివా!పరంతపా!
సదామయా!విభూతిదా!
నిధానతం శుభా మయీ!
దదామి భోగ భాగ్యముల్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,8,అక్షరము లుండును,

3.గర్భగత"-జగద్రక్ష"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!
జగత్పోష శోభ ధీరజా!
నిగమ్యంపు గమ్య మీవయా!
తగ న్నీవు వీర ధీరమా!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4.గర్భగత"-భూతి లేపనా"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లి నాథ!సదా శివా!పరంతపా!
జటల గంగ నాట్య లోల!సదా మయీ!విభూతిదా!
నిటల నేత్ర పార్వతీశ!నిధానతం శుభా మయీ!
తట పటేల?గావ రావె!దదామి భోగ భాగ్యముల్!

అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"-భక్త చింతనా"-వృత్తము,

సదా శివా!పరంతపా!స్ఫటిక లింగ మల్లి నాథ!
సదామయా!విభూతిదా!జటల గంగ నాట్య లోల!
నిధానతం శుభామయీ!నిటల నేత్ర పార్వతీశ!
దదామి భోగ భాగ్యముల్!తట పటేల?గావ రావే!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9" వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత*శోభిత"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లి నాధ!జగ ద్రక్ష భూతి లేపనా!
జటల గంగ నాట్య లోల!జగత్పోష శోభ ధీరజా!
నిటల నేత్ర పార్వ తీశ!నిగమ్యంపు గమ్య మీవయా!
తట పటేల?గావ రావె!తగన్నీవు వీర ధీరమా!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి "10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"-తట పట"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!స్ఫటిక లింగ మల్లి నాథ!
జగత్పోష శోభ ధీరజా!జటల గంగ నాట్య లోల!
నిగమ్యంపు గమ్య మీవయా!నిటల నేత్ర పార్వతీశ!
తగ న్నీవు వీర ధీరమా!తట పటేల?గావ రావె!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము గలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"-ధీరజా"-వృత్తము,

సదా శివా!పరంతపా!జగద్రక్ష భూతి లేపనా!
సదా మయా!విభూతిదా!జగత్పోష శోభ ధీరజా!
నిధానతం శుభా మయా!నిగమ్యంపు గమ్య మీవయా!
దదామి భోగ భాగ్యముల్!తగ న్నీవు వీర ధీరమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

9,గర్భగత"-విరామయా"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!సదా శివా!పరంతపా!
జగత్పోష శోభ ధీరజా!సదా మయా!విభూతిదా!
నిగమ్యంపు గమ్య మీవయా!నిధానతం!శుభామయా!
తగ న్నీవు వీర ధీరమా!దదామి భోగ భాగ్యముల్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత:-స్ఫుర ద్రూస"-వృత్తము,

సదా శివా!పరంతపా!స్ఫటిక లింగ మల్లి నాధ!జగద్రక్ష భూతి లేపనా!
సదామయా!విభూతిదా!జటల గంగ నాట్య లోల!జగత్పోష శోభ ధీరజా!
నిధానతం శుభా మయా!నిటల నేత్ర పార్వతీశ!నిగమ్యంపు గమ్య మీవయా!
దదామి భోగ భాగ్యముల్!తట పటేల?గావ రావె!తగ న్నీవు వీర ధీరమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియఘఘు కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"పదాశ్రి"-వృత్తము,

స్ఫటిక లింగ మల్లి నాథ!!జగద్రక్ష భూతి లేపనా!సదాశివా!పరంతపా!
జటల గంగ నాట్య లోల!జగత్పోష శోభ ధీరజా!సదామయా!విభూతి దా!
నిటల నేత్ర పార్వ తీశ!నిగమ్యంపు గమ్య మీవయా!నిధానతం!శుభా మయా!
తట పటేల?గావ రా వె!తగ న్నీవు వీర ధీరమా!దదామి భోగ భాగ్యముబ్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"-వరదాంగ"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!స్ఫటిక లింగ మల్లి నాథ!సదా శివా!పరంతపా!
జగత్పోష!శోభ ధీరజా!జటల గంగ నాట్య లోల!సదామయా!విభూతిదా!
నిగమ్యంపు గమ్య మీవయా!నిటల నేత్ర పార్వతీశ.నిధానతం!శుభామయా!
తగ న్నీవు వీర ధీరమా!తట పటేల?గావ రావె!దదామి భోగ భాగ్యముల్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"'ప్రభవాంగ"-వృత్తము,

సదా శివా!పరంతపా!జగద్రక్ష!భూతి లేపనా!స్ఫటిక లింగ మల్లి నాథ!
సదామయా!విభూతిదా!జగ త్పోష!శోభ ధీరజా!జటల గంగ!నాట్య లోల!
నిధానతం!శుభా మయా!నిగమ్యంపు గమ్య మీవయా!నిటల నేత్ర పార్వతీశ!
దదామి భోగ భాగ్యముల్!తగ న్నీవు వీర ధీరమా!తట పటేల?గావ రావె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"-జగత్పోష"-వృత్తము,

జగద్రక్ష భూతి లేపనా!సదా శివా!పరంతపా!స్ఫటిక లింగ మల్లి నాథ!
జగత్పోష!శోభ ధీరజా!సదామయా!విభూతిదా!జటల గంగ!నాట్య లోల!
నిగమ్యంపు గమ్య మీవయా!నిధానతం శుభామయా!నిటల నేత్ర పార్వ తీశ!
తగ న్నీవు వీర ధీరమా!దదామి భోగ భాగ్యముల్!తట పటేల?గావ రావె!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

No comments: