జైశ్రీరామ్.
చరమా చర ప్రకృతినిన్!సరగం నిలిపెడి ధీరా!చాతుర్యుడ వీవే కదా!
పరమా పరము లలమన్!పరదేవత వరదాలన్!భా తుల్యత బోధా యనన్!
గిరిజా రమణు డగుచున్!గిరులుం వనములు గూర్చెన్!గీతామృత ధారా రుచిన్!
నిరవద్యత వెలుగిడితే!నిరతా మల గుణ సృష్టిన్!నీతిం దయ నిల్పే వయా!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి"యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు26"అక్షరము
లుండును,యతులు,10,19,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"చరమా"వృత్తము,
చరమా చర ప్రకృతినిన్!
పరమా పరము లలమన్!
గిరిజా రమణు డగుచున్!
నిర వద్యత వెలుగిడితే!-
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,అక్షరములుండును ,
2.గర్భగత "పరమా"-వృత్తము,
సర గం నిలిపెడి ధీరా!
పర దేవత వరదాలన్!
గిరులుం వనములు గూర్చెన్!
నిరతామల గుణ సృష్టిన్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరములుండును ,
3.గర్భగత"వరమా"వృత్తము,
చాతుర్యుడ వీవే కదా!
భా తుల్యత బోధా యనన్!
గీతామృత ధారా!రుచిన్!
నీతిం దయ నిల్పే వయా!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు,8,అక్షరము లుండును,
4,గర్భగత"పరదేవతా"వృత్తము,
చరమా చర ప్రకృతినిన్!సరగం నిలిపెడి ధీరా!
పరమా పరము లలమన్!పరదేవత వరదాలన్!
గిరిజా రమణు డగుచున్!గిరులుం వనములు గూర్చెన్!
నిరవద్యత వెలుగిడితే!నిరతామల గుణ సృష్ఠిన్!
అణిమా ఛందము నందలి "ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును
,యతి"10"వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"-గిరులు"వృత్తము,
సరగం నిలిపెడి ధీరా!చరమా చర ప్రకృతినిన్!
పరదేవత వరదాలన్!పరమా పరము లలమన్!
గిరులుం వనములు గూర్చెన్!గిరిజా రమణు డగుచున్!
నిరతామల గుణ సృష్ఠిన్!నిర వద్యత వెలుగిడితే!
అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు,18,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"-వనములు"-వృత్తము,
చరమా చరమ ప్రకృతినిన్!చాతుర్యుడ వీవే గదా!
పరమా పరము లలమన్!భా తుల్యత బోధా యనన్!
గిరిజా రమణు డగుచున్!గీతామృత ధారా రుచిన్!
నిరవద్యత వెలుగిడితే!నీతిం దయ నిల్పే వయా!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు పాదమునకు,17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"-నిరుపమ"వృత్తము,
చాతుర్యుడ వీవే గదా!చరమా చర ప్రకృతినిన్!
భా తుల్యత బోధా యనన్!పరమా పరములలమన్!
గీతామృత ధారా రుచిన్!గిరిజా రమణు డగుచున్!
నీతిం దయ నిల్పేవయా!నిరవద్యత వెలుగిడితే!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది
ప్రాసనియమము కలదు పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యకషరమునకు చెల్లును,
8.గర్భగత"గీతామృత"వృత్తము,
సరగం నిలిపెడి ధీరా!చాతుర్యుడ వీవే గదా!
పరదేవత వరదాలన్!భా తుల్యత బోధా యనన్!
గిరులుం వనములు గూర్చెన్!గీతామృత ధారా రుచిన్!
నిరతామల గుణ సృష్ఠిన్!నీతిం దయ నిల్పే వయా!
అణిమా ఛందము నందలి "అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండు ను,
యతి,10"వ యక్షరమునకు చెల్లును,
9,గర్భగత"ధీరా"వృత్తము,
చాతుర్యుడ వీవే గదా!సరగం నిలిపెడి ధీరా!
భా తుల్యత బోధా యనన్!పరదేవత వరదాలన్!
గీతామృత ధారా రుచిన్!గిరులుం వనములు గూర్చెన్!
నీతిందయనిల్పే వయా!నిరతామలగుణ సృష్ఠిన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9,వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"-చాతుర్య"వృత్తము,
సరగం నిలిపెడి ధీరా!చరమా చర ప్రకృతినిన్!చాతుర్యుడ వీవే గదా!
పర దేవత వరదాలన్!పరమా పరము లలమన్!భా తుల్యత బోధాయనన్!
గిరులుం వనములు గూర్చెన్!గిరిజా రమణు డగుచున్!గీతామృత ధారా రుచిన్!
నిరతామలగుణ సృష్ఠిన్!నిరవద్యత వెలుగిడితే!నీతిం దయ నిల్పే వయా!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,
11.గర్భగత"వరదాల"వృత్తము,
చరమా చర ప్రకృతినిన్!చాతుర్యుడ వీవే గదా!సరగం నిలిపెడి ధీరా!
పరమా పరము లలమన్!భా తుల్యత బోధా యనన్!పరదేవత వరదాలన్!
గిరిజా రమణుడగుచున్!గీతామృత ధారా రుచిన్!గిరులుం వనములు గూర్చెన్!
నిరవద్యత వెలుగిడితే!నీతిం దయ నిల్పే వయా!నిరతామలగుణ సృష్ఠిన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు10,18,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"-గుణఖని"-వృత్తము,
చాతుర్యుడ వీవే గదా!చరమా చర ప్రకృతినిన్!సరగం నిలిపెడి ధీరా!
భా తుల్యత బోధా యనన్!పరమా పరము లలమన్!పరదేవత వరదాలన్!
గీతామృత ధారా రుచిన్!గిరిజా రమణుడగుచున్!గిరులుం వనములు గూర్చెన్!
నీతిం దయ నిల్పే వయా!నిరవద్యత వెలుగిడితే!నిరతామలగుణ సృష్ఠిన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి" ఛండము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"-నిలుపు"-వృత్తము,
సరగం నిలిపెడి ధీరా!చాతుర్యుడ వీవే గదా!చరమా చర ప్రకృతినిన్!
పరదేవత వరదాలన్!భా తుల్యత బోధా యనన్!పరమా పరము లలమన్!
గిరులుం వనములు గూర్చెన్!గీతామృత ధారా రుచిన్!గిరిజా రమణుడగుచున్!
నిరతామల గుణ సృష్ఠిన్!నీతిం దయ నిల్పే వయా!నిరవద్యత వెలుగిడితే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"-అలముకొను"వృత్తము,
చాతుర్యుడ వీవే గదా!సరగం నిలిపెడి ధీరా!చరమా చర ప్రకృతినిన్!
భా తుల్యత బోధా యనన్!పరదేవత వరదాలన్!పరమా పరము లలమన్!
గీతామృత ధారా రుచిన్!గిరులుం వనములు గూర్చెన్!గిరిజా రమణు డగుచున్!
నీతిం దయ నిల్పే వయా!నిరతామల గుణ సృష్ఠిన్!నిరవద్యత వెలుగిడితే!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
No comments:
Post a Comment