జైశ్రీరామ్.
నేటి ప్రజాసంకల్పం దినపత్రుకలో అమ్మవారి పద్యం.
490. ఓం వ్యాఘ్రగాయై నమః.🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 490వ నామము.
నామ వివరణ.
వ్యాఘ్రములను గమింపఁ జేయు జనని అమ్మ.
తే.గీ. వ్యాఘ్రగా! వ్యాఘ్ర షట్ఛత్రు వర్గము నను
బాధపెట్టుచునుండెను పరమ పథము
సాధ్యమెట్లగునమ్మరో? సంహరించి
వ్యాఘ్రచయమును, నన్ గాచి వరలనిమ్ము.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
ప్రజాసంకల్పం పత్రికవారికి ధన్యవాదములు.
జైహింద్.
No comments:
Post a Comment