జైశ్రీరామ్.
514. ఓం చక్రికాయై నమః.🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 514వ నామము.
నామ వివరణ.
దివ్య చక్రాయుధము కల తల్లి.
తే.గీ. చక్రికా! నన్ను నీ కాల చక్రమందు
నలిగి పోనీకు, నిన్ను నే నమ్మియుంటి,
వక్రగతిఁ బాపి వరలనీ వసుధ నన్ను,
వందనంబులు చేసెద నందుకొనుము.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
ఈ పద్యముపై
వేంకట్ ఉపాధ్యాయులవారి స్పందన.
ప్రతిగా నా స్పందన.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
ఆర్యా!🙏🏼
శా. ప్రాతఃకాలమునందె యమ్మ కృపకై ప్రార్ధించ నా పద్యమున్
శ్రీతత్త్వప్రతిబోధకంబనుచు మీ చిత్తంబునందెంచి, శ్రీ
మాతానందమనోజ్ఞ భావనను క్షేమంబొప్పగా చూచు మీ
ఖ్యాతిన్, భాతిని, సచ్చరిత్రమును విఖ్యాతిన్ బెంచునా యమ్మయే.
మీ అభిమానపూర్వక సద్విశ్లేషణకు ఆనందంగా ఉందండి. మీకు నా ధన్యవాదములు.👍🏻
అమ్మ కృపతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
No comments:
Post a Comment