మొదటి వ్యక్తే శ్రీ నేమాని
సాహితీ ప్రియులారా! పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు శారదా విజయోల్లాసం(అంతర్జాల భువన విజయము)లో పాల్గొంటున్న సందర్భంగా కంద ప్రాశస్త్యాన్ని వర్ణించే సందర్భంలో తన అనుభవాన్ని మనకిలా వివరిస్తున్నారు. మీరూ చూడండి. ఒక మారు నేను
నిషిద్ధారి చేయవలసి వచ్చినది. ప్రుఛ్ఛకుడు కందకూరపై కంద పద్యము
చెప్పమనినారు.
క కార నిషేధము.
నే చెప్పిన పద్యము ఇదిగో:
తొలి హల్లు ననుస్వారము
వలపల ద యు చేర్చినంత వచ్చెడు దుంపన్
పులు సావలతో వండిన
బలె బలె రుచులలరు తినగ పప్పు పిదపగా!
చూచారు కదా! ఎంత అద్భుతంగా చెప్పారండీ! వ్రాయడం ప్రారంభిస్తే ఆలోచించడం మొదలు పెట్టుతాం.ఆలోచించండం మొదలు పెట్టితే పరిష్కార మార్గంగా మన మేధస్సు పరుగులు తీస్తుంది. ఇంకేముంది? మనకైతే వ్రాయలేని పద్యమంటూ లేదే అని నిరూపించారు మన అవధానిగారు.
ఆహా! ఎంతటి మేధా సంపత్తి!!!
వారికి పాదాభివందనం.
మనమూ ప్రయత్నించి చూస్తే కృతకృత్యులం కాకపోతామా? ప్రయత్నిద్దాం. తప్పేముంది?
జైశ్రీరాం.
జైహింద్.
4 comments:
నేమాని వారి నిషిద్ధాక్షరి పూరణ చాలా బాగుంది. క నిషేధంతో ఇస్తే కంద మీద కందం ఎంత చక్కగా చెప్పారో కదా.ఇదీ సమయస్ఫూర్తి అంటే.
మీ బ్లాగు వ్యాఖ్య కోసం పద నిర్ధారణ చేయాలంటే విసుగ్గా ఉండదూ ?
అద్భుతం. పండిత నేమాని వారి పాండిత్యం, సమయస్ఫూర్తి అనన్యసామాన్యం. నేనైతే పయత్నించడానికి కూడా సాహసించను.
నమస్కారములు.
సరస్వతీ పుత్రులకు సాధ్యం కాని దేముంది ? కంద పద్యాన్ని ఇంత అందంగా " అందునా " క " తప్పించి చెప్పగల నిపుణతకు " పండిత నేమాని " వారికి శిరసాభి వందనములు
Post a Comment