Friday, September 23, 2011

పద్య విద్య గూర్చి నేమానివారి 4 బీజ అక్షరముల అర్థములున్నవారి రచన

అయ్యా! పద్య విద్య గూర్చి నేను 1996లో రచించిన ఈ పద్యమును చూడండి. ఇందులో
4 పాదములలోను 4 బీజ అక్షరముల అర్థములున్నవి, ఓం (మహత్వము), ఐం
(కవిత్వము), హ్రీం (పటుత్వము) శ్రీం(సంపద).
పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
   సాద్భుత రచనా మహత్వ ఫలము
పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
   వీచీ విలోల కవిత్వమయము
పద్యమ్ము సముచిత పదగుంఫనోపేత
   రసవిశేష పటుత్వ రాజితమ్ము
పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
   బాహుళ్య రుచిర సంపల్లలితము
సాహితీ నందనోద్యాన జనిత పారి
జాత సుమధుర సౌరభ సార కలిత
పద్యము మనోహరాకార వైభవమ్ము
భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి
రచన :- పండిత నేమాని


జై శ్రీరాం.
జైహింద్.

No comments: