Friday, September 23, 2011

ఔత్సాహికులైన పద్యకవులకు శ్రీ నేమానివారిచ్చే కొన్ని సూచనలు

అయ్యా! ఔత్సాహికులైన పద్యకవులకు కొన్ని సూచనలు:
అమృతము, వికృతి మొదలైన పదములలో ఋ కారమును అచ్చు గా తెలిసికొని తేల్చి
పలకాలి.  ఆ అక్షరమునకు ముందున్న అక్షరము హ్రస్వము ఐతే లఘువుగానే ఉంటుంది.
కొందరు నొక్కి పలికి గురువులాగ భావిస్తూ ఉంటారు.

సంస్కృత శ్లోకములలో వేరు వేరు పదములైనా రెండవ పదములో మొదటి అక్షరము
సంయుక్తాక్షరము ఐతే ఆ ముందున్న అక్షరం గురువు అవుతుంది.  తెలుగు
పద్యములలో అలా కాదు.  ఉదా: కొంత శ్రమ - ఇందులో కొంతలోని త గురువు కాదు,
లఘువే.  తెలుగు పద్యములలో మరొక వెసులుబాటు కూడా ఉంది.  ప్ర హ్ర మొదలైన
పదములకు ముందున్న పదములోని చివరి అక్షరము (ఒకే సమాసమే అయినా) దానిని
తేల్చి అయినా పలక వచ్చును లేదా నొక్కి అయినా పలకవచ్చును.  అవకాశము
ప్రకారము లఘువుగా నైన లేక గురువుగ నైన వాడుకో వచ్చును.  ఉదా: ఆష్ట
ప్రక్రియలు - ఇందులో అష్ట లోని ష్టను గురువుగా గాని లేక లఘువుగా గాని
వాడుకోవచ్చును. -  నేమాని.


జైశ్రీరాం.
జైహింద్.

No comments: