Friday, October 24, 2008

యతులను గూర్చి తెలుసుకొందాం ౨ వ భాగం

యతుల కోసం మతులు పోకోట్టుకోవడంఎందుకు మనం? నేర్సుకొందాంరండి. ౨ వ భాగము.

యతుల విషయాలు క్రిందటి సారి కొన్ని తెలుసుకొన్నాంకదా! ఇప్పుడు మరికొన్ని తెలుసుకొందామా?
వ్యంజన యతులు :-
1) వర్గజ యతులు :- కవర్గాదులలో పంచమాక్షరం మినహ మిగిలిన 4 హల్లులూలకూ పరస్పరం యతి చెల్లును.
క. ఖ. గ. ఘ. { క } వర్గజ యతి
చ. ఛ. జ. ఝ. { చ } వర్గజ యతి.
ట. ఠ. డ. ఢ. { ట } వర్గజ యతి
త. థ. ద. ధ. { త } వర్గజ యతి.
ప. ఫ. బ. భ. { ప } వర్గజ యతి.
ఏ వర్గక్షరములకా వర్గాక్షరములు తమలో తాము యతిచెల్లును.
2) బిందు యతి :-
" ఙ " తో > ంక. ంఖ. ంగ. ంఘ.
" ఞ " తో > ంచ. ంఛ. ంజ. ంఝ.
" ణ " తో >ంట. ంఠ. ండ. ంఢ.
" న " తో > ంత. ంథ. ంద. ంధ.
"మ " తో >ంప.ంఫ. ంబ. ంభ. లు బిందు యతిపేరుతో పరస్పరము చెల్లును.
3) తద్ భవ వ్యాజ యతి:- " జ్ఞ - న - ణ " లు పరస్పరము చెల్లును.
4) విశేష యతి:- " జ్ఞ " - క - ఖ - గ - ఘ. లు పరస్పరము చెల్లును.
5) అనుస్వార సంబంధ యతి :- " ంట - ంఠ - ండ - ంఢ - ంత - ంథ - ంద - ంధ -లు పరస్పరము చెల్లును.
6) అను నాసికాక్షర యతి :-
" న " తో > ంట - ంఠ - ండ - ంఢ. చెల్లును.
" ణ " తో > ంత - ంథ - ంద - ంధ. చెల్లును.
7) ము కార యతి :- "పు - ఫు - బు - భు - ము ' లు చెల్లును.
8) మ వర్ణ యతి :- " మ - ం య - ం ర - ం ల - ం వ - ం శ - ం ష - ం స - ం హ " లు చెల్లును.
9) సరస యతి :-
" అ - య - హ " లు చెల్లును.
" చ - ఛ - జ - ఝ - శ - ష - స " లు చెల్లును.
" న - ణ " లు చెల్లును.
10) అ భేద యతి :-
" వ - బ " లు చెల్లును.
" ల - ళ " లు చెల్లును.
" ల - డ " లు చెల్లును.
11) అ భేద వర్గ యతి :- " ప - ఫ - బ - భ - వ " లు చెల్లును.
12) సం యుక్త యతి :- " క్ష్మ " వంటి సం యుక్త హల్లులో గల " క - ష - మ "లలో యేదో వొక దానికి యతి వేయ జెల్లును.
13) అంత్యోష్మ సంధి యతి :- " వాక్ + హరి = వాగ్ఘరి " ఇందు " క ' తో గాని " హ " తో గాని యతి వేయ జెల్లును.
14) వికల్ప యతి :- " సత్ + మతి = సన్మతి. " ఇందు " త " తో గాని " న " తో గాని యతి వేయ జెల్లును.
పైన వివరించినవన్నీ పరస్పరమూ చెల్లునని గ్రహింప గలము.
ఇప్పటికే మీరు బాగ అలిసిపోయినట్లున్నారు. మరికొన్ని యతులను గూర్చి మరొకనాడు కలుసుకొన్నాప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. జైహింద్


No comments: