Friday, February 14, 2025

135 విభిన్న వృత్తాల లక్షణాలు.

 అపరాజిత (పరాజిత) 14 శక్వరి 5824 –  న-న-ర-స-ల-గ 9

అలసగతి 15 అతిశక్వరి 7648 – న-స-న-భ-య 10

అభినవతామరస (కమలవిలాసిని, తామరస, లలితపద, తోదక, తోవక, దోధక, కలరవ) 12 జగతి 4896 – న-జ-జ-య 8

అశ్వగతి (అశ్వాక్రాంత, పద్మముఖీ, సంగత) 16 అష్టి 28087 –  భ-భ-భ-భ-భ-గ 10

ఇంద్రవజ్ర 11 త్రిష్టుప్ 357 –  త-త-జ-గ-గ 8

ఉత్పలమాల 20 కృతి 355799 - భ-ర-న-భ-భ-ర-ల-గ 10

ఉపేంద్రవజ్ర 11 త్రిష్టుప్ 358 – జ-త-జ-గ-గ 8

కమలవిలసిత (సురుచిర, ఉపచిత్ర, సుపవిత్ర) 14 శక్వరి 4096 –  న-న-న-న-గ-గ 9

కమలాకర 15 అతిశక్వరి 7033 –  స-న-జ-జ-య 11 *

కల్యాణ 26 ఉత్కృతి 2184355 –  ర-జ-జ-ర-జ-ర-స-ర-ల-గ 8,13,22 *

కరిబృంహిత 21 ప్రకృతి 782271 – U భ-న-భ-న-భ-న-ర 13

కవికంఠభూషణ (కవికంఠవిభూషణ) 19 అతిధృతి 177900 –  స-జ-స-స-స-జ-గ 9

కవిరాజవిరాజితము (హంసగతి, మహాతరుణీదయిత) 23 వికృతి 3595120 –  న-జ-జ-జ-జ-జ-జ-ల-గ 8,14,20

కాంతి (కలికాంత, కాంత, గీతాలంబన, మోటక, మోటనక) 11 త్రిష్టుప్ 877 –  త-జ-జ-ల-గ 8

కుసుమలతావేల్లిత (చంద్రలేఖా, చిత్రలేఖా) 18 ధృతి 37857 –  మ-త-న-య-య-య 12

కుసుమవిచిత్ర (గజలలిత) 12 జగతి 976 –  న-య-న-య 7

క్రౌంచపద (తెలుగు) 24 సంకృతి 4193479 –  భ-మ-స-భ-న-న-న-య 11, 19 ప్రాసయతి (1,5)

క్షితి 1 శ్రీ 2 – I ల

గణనాథ 12 జగతి 911 –  భ-య-భ-య 7 *

గాయక 23 వికృతి 1794927 –  భ-జ-జ-య-భ-భ-భ-గ-గ 9,13,20 *

గౌరీ (చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ, ప్రభ, ప్రభాత) 12 జగతి 1216 –  న-న-ర-ర 8

చంద్రమౌళి 6 గాయత్రి 11 –  ర-య *

చంద్రవదన (కామలతికా, కామలలితా) 6 గాయత్రి 15 –  భ-య

చంద్రశ్రీ 15 అతిశక్వరి 5058 –  య-మ-న-య-య 11 *

చంద్రశేఖర 15 అతిశక్వరి 10928 –  న-జ-ర-జ-ర 13 *

చంద్రికా (అపరవక్త్ర, ప్రసభ, భద్రికా) 11 త్రిష్టుప్ 704 – న-న-ర-ల-గ 11

చంపకమాల 21 ప్రకృతి 711600 - న-జ-భ-జ-జ-జ-ర 11

జన (పుష్ప, మద, మధు, బలి) 2 అత్యుక్త 4 –  ల-ల

జలద 13 అతిజగతి 3543 – U – భ-ర-న-భ-గ 10

జలధరమాలా (కాంతోత్పీడా) 12 జగతి 241 –  మ-భ-స-మ 9

జాగ్రత్ 17 అత్యష్టి 28540 –  స-న-జ-న-భ-గ-గ 11 *

జ్ఞాన 16 అష్టి 15805 – U త-న-భ-భ-స-గ 10 *

డమరుక 16 అష్టి 30564 –  స-త-జ-స-న-గ 9 *

డిండిమ 15 అతిశక్వరి 11230 –  జ-స-న-జ-ర 11 *

తనుమధ్యా 6 గాయత్రి 13 –  త-య

తనుమధ్యమా 18 ధృతి 77378 –  య-మ-య-న-ర-ర 8,15 *

తన్వీ 24 సంకృతి 4155367 –  భ-త-న-స-భ-భ-న-య 13

తరళ (ధ్రువకోకిల) 19 అతిధృతి 186040 –  న-భ-ర-స-జ-జ-గ 12

చంచల (చిత్రశోభ) 16 అష్టి 43691 –  ర-జ-ర-జ-ర-ల 9

తాండవజవ 18 ధృతి 63484 –  స-న-న-స-న-య 12 *

తారక 17 అత్యష్టి 31612 –  స-న-జ-జ-న-గ-గ 11 *

తుల్య-1 24 సంకృతి 15978301 –  త-న-త-న-త-న-త-న 7,13,19 *

తుల్య-2 23 వికృతి 3395380 –  స-భ-త-న-త-న-త-ల-గ 13 *

తోటక (ఛిత్తక, భ్రమరావళి, నందినీ) 12 జగతి 1756 –  స-స-స-స 9

దండకము – చివర గురువుతో నున్న ఒక త-గణ దండకము

దేవ 14 శక్వరి 1639 –  భ-త-య-స-గ-గ 9 *

దోదక (దోధక, తరంగక, బందు, భిత్తక, తోటక, తోదక) 11 త్రిష్టుప్ 439 –  భ-భ-భ-గ-గ 7

ద్రుతవిలంబిత (సుందరీ, హరిణప్లుతా) 12 జగతి 1464 –  న-భ-భ-ర 7

నతి 22 ఆకృతి 2023015 –  భ-త-య-న-జ-జ-న-గ 9,15 *

నలినీ (భ్రమరావళి, శ్రీ) 15 అతిశక్వరి 14044 –  స-స-స-స-స 10

నవనందినీ 14 శక్వరి 3820 –  స-జ-స-న-గ-గ 9

నారాయణ 8 అనుష్టుప్ 163 –  ర-త-గ-ల *

నిశా (నారాచ, నారాచక, మహామలికా, సింహవిక్రీడిత, వరదా ) 18 ధృతి 74944 –  న-న-ర-ర-ర-ర 9

పంక్తి (అక్షరోపపదా, అక్షరపంక్తి, కాంచనమాలా, కుంతలతన్వీ, భూతలతన్వీ, హంసా, సుందరి ) 5 సుప్రతిష్ఠ 7 –  భ-గ-గ

పంచచామరము (నారాచ, మహోత్సవ )16 అష్టి 21846 – జ-ర-జ-ర-జ-గ 10

పద్మనాభ 25 వికృతి 1198373- త-త-త-త-త-త-త-గ-గ 13

పరమేశ 14 శక్వరి 3452 –  స-న-జ-భ-గ-గ 10 *

పురుష 9 బృహతి 31- భ-స-మ 7 *

పృథ్వి (ధృతి, విలంబితగతి) 17 అత్యష్టి 38750 –  జ-స-జ-స-య-ల-గ 9 లేక 12

పుష్పితాగ్రా – బేసిపాదము – న-జ-ర-య / సరిపాదము – న-జ-ల-ర-య

ప్రకృతి 8 అనుష్టుప్ 52 –  స-భ-గ-గ 5 *

ప్రభాకలిత 19 అతిధృతి 175472 –  న-జ-జ-భ-ర-జ-గ 13

ప్రభాత (మృగేంద్రముఖ, సువక్త్రా, అచల) 13 అతిజగతి 1392 – న-జ-జ-ర-గ 8

ప్రభు 26 ఉత్కృతి 28761088 –  న-న-న-జ-జ-జ-జ-జ-ల-గ 9,15,21

ప్రమితాక్షర 12 జగతి 1772 –  స-జ-స-స 9

ప్రహరణకలితా (కలికా) 14 శక్వరి 8128 –  న-న-భ-న-ల-గ 8

ప్రహర్షిణి (మయూరపిచ్ఛ) 13 అతిజగతి 1401 – మ-న-జ-ర-గ 8

ప్రియంవదా (మత్తకోకిల) 12 జగతి 1400 –  న-భ-జ-ర 8

ప్రియకాంతా (కాంత) 16 అష్టి 13264 –  న-య-న-య-స-గ 11

ఫలసదన 16 అష్టి 16384 –  న-న-న-న-స-గ 10

బిల్వ 6 గాయత్రి 55 – UII UII భ-భ *

బ్రహ్మ (ద్వియోధా, స్రగ్విణీ, హంసమాలా )6 గాయత్రి 19 – ర-ర

భాస్కరవిలసితము 25 అభికృతి 8381311 – భ-న-జ-య-భ-న-న-స-గ 13

భుజంగప్రయాతము (అప్రమేయా) 12 జగతి 586 –  య-య-య-య 8

భూతిలక 19 అతిధృతి 186039 –  భ-భ-ర-స-జ-జ-గ 12

భూనుత (లతా, వనలతా, వలనా) 14 శక్వరి 3515 – ర-న-భ-భ-గ-గ 10

భ్రమరవిలసిత 11 త్రిష్టుప్ 1009 – మ-భ-న-ల-గ 6

మంగళమణి 16 అష్టి 31711 –  భ-స-న-జ-న-గ 11 *

మంగళమహాశ్రీ 26 ఉత్కృతి 15658735 – భ-జ-స-న-భ-జ-స-న-గ-గ 9,17

మంజుభాషిణి (కనకప్రభా, జయా, నందినీ, ప్రబోధితా, మనోవతీ, విలంబితా, సునందినీ, సుమంగలీ) 13 అతిజగతి 2796 –  స-జ-స-జ-గ 9

మందాక్రాంత (శ్రీధరా) 17 అత్యష్టి 18929 –  మ-భ-న-త-త-గ-గ 11

మణిదీప్తి 19 అతిధృతి 55513 –  మ-స-స-త-జ-య-గ 11 *

మణిభూషణ (రమణీయక, సుందర, ఉత్సర, మణిభూషణశ్రీ) 15 అతిశక్వరి 11707 – ర-న-భ-భ-ర 10

మణిమాలా (అబ్జవిచిత్రా, పుష్పవిచిత్రా) 12 జగతి 781 – త-య-త-య 7

మత్తకీర 20 కృతి 372096 – న-న-జ-భ-ర-స-ల-గ 13 *

మత్తకోకిల (చర్చరీ, మల్లికామాల, మాలికోత్తరమాలికా, విబుధప్రియా, హరనర్తన, ఉజ్జ్వల, హరిణప్లుత) 18 ధృతి 93019 –  ర-స-జ-జ-భ-ర 11

మత్తమయూర (మాయా) 13 అతిజగతి 1633 – మ-త-య-స-గ 8

మత్తేభ (అశ్వధాటి) 22 ఆకృతి 1915509 – త-భ-య-జ-స-ర-న-గ 8,15

మత్తేభవిక్రీడితము 20 కృతి 298676 – స-భ-ర-న-మ-య-ల-గ 14

మదనవిలసిత (ద్రుతగతి, చపలా, మధుమతి, లటహ, హరివిలసిత) 7 ఉష్ణిక్ 64 – న-న-గ

మనోహర 13 అతిజగతి 2731 – ర-జ-ర-జ-గ 9 *

మహామంగళమణి 15 అతిశక్వరి 14020 – స-మ-స-స-స 9 *

మహాస్రగ్ధర 22 ఆకృతి 605988 –  స-త-త-న-స-ర-ర-గ 9,16

మానిని (మదిరా, లతాకుసుమ, సంగతా) 22 ఆకృతి 1797559 – భ-భ-భ-భ-భ-భ-భ-గురు 7,13,19

మాలిని (నాందీముఖీ) 15 అతిశక్వరి 4672 –  న-న-మ-య-య 9

మేఘవిలసిత 12 జగతి 2041 – U మ-న-న-స 6

మౌక్తికమాలా (కుట్మలదంతీ, రుచిరా, సాంద్రపద, భద్రపద) 11 త్రిష్టుప్ 487 –  భ-త-న-గ-గ 7

యశస్వి 22 ఆకృతి 450553 –  మ-న-న-న-జ-జ-య-గ 6,14,20 *

రథోద్ధత (పరాంతిక) 11 త్రిష్టుప్ 699 – UI UIII UI UIU ర-న-ర-ల-గ 7

రుక్మవతి (చంపకమాలా, పుష్పసమృద్ధి, సుభావా)10 పంక్తి 199 –  భ-మ-స-గ 6

రుచిర (కలావతీ, అతిరుచిరా, సదాగతి) 13 అతిజగతి 2806 –  జ-భ-స-జ-గ 9

లక్ష్మీ 22 ఆకృతి 1047760 –  న-య-స-భ-న-న-స-గ 13 *

లలిత (దయి) 4 ప్రతిష్ఠ 16-  న-ల

వనమంజరి 21 ప్రకృతి 744304 – న-జ-జ-జ-జ-భ-ర 14

వనమయూర (ఇందువదనా) 14 శక్వరి 3823 – భ-జ-స-న-గ-గ 9

వసంతతిలక (ఉద్ధర్షిణీ, ఔద్ధర్షిణి, కర్ణోత్పలా, మధుమాధవీ, శోభావతీ, సింహోన్నతా, సింహోద్ధతా) 14 శక్వరి 2933 – త-భ-జ-జ-గ-గ 8

వసన (కమల, మహి) 8 అనుష్టుప్ 96 – న-స-ల-గ

వాణి 19 అతిధృతి 106225 – మ-భ-స-న-య-స-గ 16 *

వామదేవ 16 అష్టి 21995 – U ర-జ-న-ర-జ-గ 10 *

విద్యున్మాలా (విద్యుల్లేఖా) 8 అనుష్టుప్ 1 –  మ-మ-గ-గ 5

శంకర-1 15 అతిశక్వరి 7135 –  భ-స-న-జ-య 11 *

శంకర-2 16 అష్టి 30703 –  భ-జ-న-స-న-గ 11 *

శంభునటనము 26 ఉత్కృతి 31317470 –  జ-స-న-భ-జ-స-న-భ-ల-గ 10,18

శతపత్ర (చారుమతి) 25 అభికృతి 14872303 –  భ-జ-స-న-భ-జ-స-న-గ 9,17

శశివదనా (కనకలతా, చతురంశా, మకరశీర్షా, ముకులితా) 6 గాయత్రి 16 – IIII UU న-య

శార్దూలవిక్రీడితము 19 అతిధృతి 149337  మ-స-జ-స-త-త-గ 13

శిఖరిణి 17 అత్యష్టి 59330 –  య-మ-న-స-భ-ల-గ 13

శివ 6 గాయత్రి 43 –  ర-జ *

శివశంకర (సురభి) 18 ధృతి 126844 –  స-న-జ-న-భ-స 11 *

శోభనమహాశ్రీ 25 అభికృతి 14498421 – త-భ-య-జ-స-ర-న-భ-గ 8,15,22 *

శ్రీ 1 శ్రీ 1 – U గ

శ్రీకర 13 అతిజగతి 2732 –  స-జ-ర-జ-గ 9 *

శ్రీమతి 17 అత్యష్టి 22115 – ర-త-య-స-జ-గ-గ 12 *

సంజ్ఞా (కమలలోచనా, కమలాక్షీ, చండీ) 13 అతిజగతి 1792 – న-న-స-స-గ 9

సన్నుత 15 అతిశక్వరి 15851 – ర-జ-న-భ-స 10 *

సభా (గురుమధ్యా) 6 గాయత్రి 52 – స-భ

సరసిజ (మదలేఖా, విధువక్త్రా, సురుచిర) 7 ఉష్ణిక్ 31 – భ-స-గ

సలిల 5 సుప్రతిష్ఠ 28 – IIUII స-ల-ల *

సాయం 11 త్రిష్టుప్ 345 – మ-స-జ-గ-గ 6 *

సుకాంతి (జయా, నగానితా, నగణికా, లాసినీ, విలాసినీ) 4 ప్రతిష్ఠ 6 –  జ-గ

సుగంధి (ఉత్సవ, ఉత్సాహ, చామర, తూణక, మహోత్సవ, శాలిని, ప్రశాంతి) 15 అతిశక్వరి 10923 – ర-జ-ర-జ-ర 9

సుభగ 8 అనుష్టుప్ 52 –  స-భ-గ-గ *

సుముఖీ (ద్రుతపాదగతి) 11 త్రిష్టుప్ 880 –  న-జ-జ-ల-గ 7

స్రగ్ధర 21 ప్రకృతి 302993 –  మ-ర-భ-న-య-య-య 8,14

స్రగ్విణీ (లక్ష్మీధర, పద్మినీ) 12 జగతి 1171 – ర-ర-ర-ర 7

స్వాగతము 11 త్రిష్టుప్ 443 –  ర-న-భ-గ-గ 7

కవికంఠభూషణ (కవికంఠవిభూషణ)స-జ-స-స-స-జ-గ. యతి 9.

జైశ్రీరామ్.

కవికంఠభూషణ (కవికంఠవిభూషణ)స-జ-స-స-స-జ-గ. యతి 9.

పరమేశ్వరా! శుభద! భక్తజనావన! పాహిమాం సదా,

స్మరియింపనీ సతము చక్కగ భక్తిని నిన్ను తృప్తిగా,

నిరపాయమౌ నడత నిత్యము నాకునొసంగి కావుమా,

ధరణిన్ జనుల్ శుభనిధానములై వరలంగఁ జేయుమా. CRK.

జైహింద్.

Saturday, January 4, 2025

చిత్ర కవిత.....కోవెల సంతోష్ కుమార్.

జైశ్రీరామ్.

 చిత్ర కవిత.

భాష మీద అధికారం, పద్యవిద్యా ప్రాగల్భ్యం ఉండటం సాధారణంగా కావ్యరచనకు తగిన అవసరం. దీంతో పాటు పదప్రయోగంలో ఏయే అక్షరాలు ఎక్కడెక్కడ ఒదిగి ఉంటవో సద్య స్ఫురణలో ఉండటం చిత్రకవితకు ప్రధాన లక్షణం. చిత్ర కవితలో గర్భ కవిత్వం, బంధ కవిత్వం, ఏకాక్షర, ద్యక్షర పద్యాలు, పద్య భ్రమక, పాద భ్రమకాలు.. అనులోమ విలోమ రీతులు, అంతర్భవిస్తవి. చిత్ర కవిత నిర్వహణకు ఛందస్సు మీద ఉన్న అధికారం గర్భ కవిత్వానికి ప్రధానమైన అర్హత. సీస పద్యంలో మత్తేభం నాలుగు పాదాల్లో ఇమిడిపోతుంది. అట్లాగే గీత పద్యంలో కందము ఇమిడిపోతుంది. పై పాదాలలో మొదట చివర చేర్చవలసిన అక్షరాలు యతులకు అనుగుణంగా తెలిస్తే ఇది సాధ్యమవుతుంది.అట్లాగే ఇతర గర్భ పద్యాలకు కూడా. ప్రబంధ రాజ వెంకటేశ్వర విలాసంలో గణపవరపు వెంకట కవి ఒక సీస పద్యంలో సుమారు 190 పద్యాలను ఇమిడించాడు. ఇది ప్రపంచంలోనే ఛందో విద్యలో అసామాన్యమైన పోటీలేని ఒక గొప్ప ఉపలబ్ధి. కంద పద్యంలో ఆయా భాగాల్లో విరుపులతో నాలుగు కంద పద్యాలు ఇమిడిపోతవి. ఇది యతి ప్రాసలను ఇమిడించుకునే ఎరుకతో సాధించవచ్చు. ఆధునిక కాలంలో ఒక కవి భారత గర్భ రామాయణం అని ఒక అపూర్వ ప్రబంధాన్ని నిర్మించాడు. గర్భ పద్యాలలో రామాయణ గాధ, మొత్తం పద్యంలో భారత గాధ ఇమిడి ఉంటాయి. ఇది ఒక విధంగా ద్వ్యర్థి కావ్యాలకు విలక్షణమైన చేర్పు. సంస్కృతంలో అనులోమ విలోమ కావ్యంగా రామాయణ భారతాలను ఇమిడించిన ఒక అద్భుత కావ్యం ఉన్నది.

ఇంకా చిత్రకవిత్వంలో ఒక అక్షరంతోని, రెండు అక్షరాలతోని పద్యాలు నిర్మించే ప్రక్రియ ఉన్నది. ఈ రీతి కవికి ఉన్న నిరంతర భాషాధ్యయనము, నిఘంటు పరిజ్ఞానము వల్ల సాధ్యపడుతుంది. పద్య భ్రమక, పాద భ్రమకాలు భాషమీద ఛందస్సు మీద ఉన్న పట్టు వల్ల సాధింపబడేవి. శ్రీరామా, రామాశ్రీ అన్న కంద పద్య తొలిపాదం పాద భ్రమక రీతికి ఒక ఉదాహరణ. నాలుగు పాదాలు ఇలాగే రచన సాగుతుంది. శబ్దాల బహు అర్థ సంఘటన అక్షరాలను పోహళించే రీతి గురు లఘవుల పొదిగింపు ఈ ప్రజ్ఞలన్నీ చిత్ర కవితకు అత్యవసర సాధనాలు.

బంధ కవిత్వం విషయం వస్తే, విచిత్రమైన ఆకారాలు, ఛత్రము, ఖడ్గము, నాగము, గజము మొదలైనవి కల్పించి వాటిలో తాను ఇమిడించదలచుకున్న పద్యానికి తగిన గడులను ఏర్పరిచి ఆ అక్షరాలు రెండు మూడు సందర్భాలలో, భిన్న భిన్న అర్థాలలో కుదిరేట్లు నిర్మించుకోవటం తో పాటు గణ యతి ప్రాసలకు భంగం కలగకుండా పద్య రచన సాగించవలసి ఉంటుంది. ఈ బంధ కవిత్వాన్ని నూరు పైగా బంధాలలో చిత్రించిన వారు కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన శతావధానం కృష్ణమాచార్యులు. అట్లాగే వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో (వాటిలో అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ట్య, నిర్వచన కావ్యాలు ఉన్నవి) 60 విలక్షణమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు నూరుకు మించే ఉన్నాయి.

చిత్ర కవిత్వ అభ్యాసం ప్రధానంగా తెలంగాణాలోని కవుల రచనల్లో కన్పిస్తుంది. ఈ రకమైన విలక్షణ స్థితికి ఈ ప్రాంతంలో కవులలో ఉండే సృజన శీలంలోని ప్రయోగ దృష్టి కారణం అని చెప్పాలి. ఈ విషయం ప్రత్యేకంగా పరిశోధించితే ఈ కవులు చేసిన ప్రయోగాలలోని వైశిష్ట్యము, నైపుణ్యం తెలియవస్తాయి. చిత్రకవిత్వ పద్యాలు సాధారణంగా కావ్య మధ్యంలో దేవతా స్థుతులలో కన్పిస్తుంది. ఈ కావ్యాలలోని చక్రబంధం విలక్షణమైంది. దీన్లో ఒక వలయంలో కావ్య నామం, ఇంకొక వలయంలో కవి నామం, నిక్షేపింపబడి ఉంటాయి. మరింగంటి సింగరాచార్యులు రచించిన బిల్హణీయ కావ్యం ఇంకొకరి రచనగా ప్రచారం అయినా, చక్రబంధంలో నిక్షేపింపబడిన నామం వల్ల అది ఆయన రచనగా సురవరం ప్రతాపరెడ్డి గారు నిర్ణయించారు. చిత్ర కవిత్వం కవి వు్యత్పన్నతకి, అసాధారణ ప్రజ్ఞకు ఉదాహరణ. ఇది ఒక ప్రత్యేకమైన విద్యావిశేషం. ప్రహేళికల వంటి నిర్మాణం. ఆధునిక సాహిత్య విమర్శకులు దీన్నేదో గారడీ విద్య అని నిరసించే ప్రయత్నం చేశారు. ఈ కాలంలో అసాధారణ ప్రతిభాభ్యాసాలకు గిన్నిస్‌ బుక్‌ వంటి వాటిలో స్థానం లభిస్తున్నది. అయితే తెలుగు కవిత్వం సాధించిన ఈ అసాధారణ ప్రజ్ఞా విశేషాలను గూర్చి మనం ఎందుకు గర్వించకూడదో అర్థం కాదు. కవిత్వం అంతా భావ కవిత్వంలా ఉండదు. జీవితమంతా హంసతూలికా తల్పంలా ఉండదు. జీవితంలో వైవిధ్యం ఎలాంటిదో కవిత్వంలోని వైచిత్రి కూడా అలాంటిది. జీవితంలో అద్భుతం, మనస్సుకు ఎంత ఉదాత్తతను కల్పిస్తుందో, చిత్ర కవిత్వం కల్పించే అలాగే చిత్తానికి ఉన్నతిని కల్పిస్తుంది. మనం సమాహిత చిత్తంతో చిత్ర కవిత్వాన్ని అది కలిగించే అచ్చెరువుని అనుభవిద్దాం.


జైహింద్.