జైశ్రీరామ్.
పంచ రత్నాలు
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,
1.శా;-శ్రీమా మామృత ధారలం దనియుచున్!దివ్యుం!శిరో ధార్యుడౌ!
రాముం రమ్య గుణాభి రాము చరితం!రమ్యంబుగా గూర్చితే!
మా మాంబోధి రసత్కళా రమమగున్!మార్మోగ కీర్తింపగా!
ధామంబౌ!వర రామమౌ నిల బుధా!తత్ప్రాప్తి! దీక్షా రతిన్!
తత్ప్రాప్తి=స్వర్గము పొందెడు,
2.సీ;-భానోష దయ కాల!భాగ్యంబుగా నెంచి!
కనులార చిత్రాలు కాంచి కాంచి!
మించిన ప్రేమ మేథలో కదలాడ!
రామ కృష్ణుని గాంచి రమ్య ధృష్టి!
పంచ రత్నాలలో!ప్రణవ మోంకారంబు!
రామ భీజ మహిమ రాజిలంగ!
శ్రీరామ!మా రామ! రఘు రామ!రామంచు!
భక్తితో నుతియించి!బరగ దలచి!
తే,గీ:-కోర కుండక!కృతి కేను!కూర్మి కతన!
వ్రాయు చుంటిని!దీవించి!ప్రణుతు లిడుచు!
రామ తారక మంత్రంబు!రహిని వెలుగ!
జీవ ముక్తిని కాంక్షించి!జీవ తతికి!
3.సీ;-ఏ జిహ్వ!రాముని!యింపార బల్కునో?
యా జిహ్వ జిహ్వయౌ!యవని యందు!
ఏ రామ స్మరణంబు!యే మనంబంటునో?
ఆ మనంబదె సుమ్మ!యవని మిన్న!
ఏ రామ కీర్తన!యింపొంద శృతమౌనొ?
ఆ మాన్యు జీవంబు!హాయి గనును!.
ఏ రామ శతకంబు యీరాము కృతి యాయె!
రాఘవ ప్రోక్తమై!రక్తి గనుత!
తే,గీ;-రామ కృష్ణాఖ్య!రస రమ్య!రాజ తిలక!
జన్మ జన్మల పుణ్య మీ జన్మ కాగ!
భాష మాధుర్య!శోధిత మాన్య చరిత!
చిత్ర గర్భ కృతి వధాన్య!శ్రికర మగు!
4.సీ:-ఊల పల్లి సు వంశ!యుద్యత్ఘన సు కీర్తి
లలిత సాంభ శివుల లాల నాన!
రాఘవ శతకంబు!రమ్యమై!రస నిల్చు!
కల్ప కల్పాంతర !కౌము దౌచు!
జన్మ సార్ధక మాయె!జగదేక రాముండు!
రామ కృష్ణుని మేథ! సోమ మేర్చె!
రామ రామ యనగ!రమ రామమౌ గదే?
రమణి సీతమ్మయే!రక్ష కాగ!
తే,గీ:-జీవ సౌఖ్యంబు జేకూర్చి!జీవ సరళి,
నిండు నూరేండ్లు భక్తి తా నెలకొనంగ!
శివుని భద్రత నెంచిన జీవి యేను!
సతత మాశీస్సు లందింతు!శర్వు!కృపచె!
5.సీ:-వెలుగైన తెలుగుకే!విలువ తా పెంపేర్చి!
విన్యాసములు జేయు వేద్యు డౌచు!
చిత్రాలు బంధాలు!చిన్ముద్ర లేయించి!
ముద్రిత ప్రతులకే!మోద మేర్చి!
గర్భ మర్మ మెరిగి!కంజాత సుమములు!
గర్భ కవిత పూజ!కర్పి తమయె!
భావి తరములెల్ల బాగు తెల్గన బొల్చు
తెలుగు చేతలవెల్గ!తీర్చి దిద్దు!
తే,గీ:-తెలుగు మాంథ్యంబు!మందమై!వెలిగె నేడు!
తేనె లొలికెడి తెన్గుకు!తీపి వౌచు
రామ కృష్ణాఖ్యు శోధన!దివురు భవిని!
తెలుగు భాషలందున లెస్స!దీప్తి జగతి!
జైహింద్.
No comments:
Post a Comment