Friday, April 8, 2016

“దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్”

జైశ్రీరామ్. 
దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్
                       "శ్రీరామకవిచంద్రుని నేను రెండవ శ్రీనాధునిగా నామనస్సులోఅనుకొందును …ఇక్కవి సహజపాండిత్య విషయముననే కాక భాగవతాంధ్రీకరణప్రసక్తియందుఁగూడ బోతరాజు గారేఈయనసరసకవి,విద్వత్కవి,ఆశుకవి,దాత,ేత.... 19వ శతాబ్దమున నుదయించిన యాంధ్రకవులలో నిట్టికవి మృగ్యుడుఇన్నియదృష్టములు సంఘటించిన కవి లేనే లేఁడు.ఇవి దాసు శ్రీరామకవి కవితా కౌశల్యాన్ని కొనియాడుతూశతావధాని బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి  గారు అన్నమాటలుప్రముఖన్యాయవాదిసంఘసంస్కర్త, వాగ్గేయకారుడుమహాకవిగా 19  శతాబ్దములోఆంధ్రదేశంలో సంగీత,సాహిత్య,సాంస్కృతిక రంగాలను,సంఘసంస్కరణోద్యమాలను ప్రభావితము చేసిన బహుముఖ ప్రఙ్ఞాశాలి  దాసు శ్రీరాములు  ఏప్రిల్ 8,  1846  కూరాడ గ్రామంలో జన్మించారు.కృష్ణాజిల్లా,ముదినేపల్లి మండలంలో అల్లూరిఅగ్రహారీకులు,సంపన్నకుటుంబీకులు కన్నయ్యకామమ్మ పుణ్యదంపతులకుఏకైకసంతానంస్వయంకృషితోనే విద్యాభ్యాసం చేస్తూ   సంస్కృతాంధ్ర భాషల్లోపండితులై   ప్రబంధాలుపురాణాలు,   నాటకాలుశతకాలు,ధర్మశాస్త్రగ్రంధాలు,కృతులు,జావళీలు,పదములు,యక్షగానాలు మొదలైన వైవిధ్య ప్రక్రియలలో ముప్పదికి పైగా గ్రంధాలు రచించారు.  వారి రచనలో చివరదిమకుటాయమానమైన  శ్రీ దేవీభాగవతము. ఆశుకవితాధారగా ఐదున్నర నెలలస్వల్పకాలంలో అనువదించారు.
                శ్రీరాములు గారు అసామాన్యమైన మేధస్సుకలవారు. 'గీర్వాణపీఠం'గా పేరుపొందిన ఆకిరిపల్లి లో అప్పటి నూజివీటి సంస్థానాధీశులు ఏర్పరిచిన నెలకు 8 అణాల ఉపకారవేతనంతో (1858 సం.లొ) పదినెలలు ఉండిసంస్కృత  వ్యాకరణం నేర్చుకోవటమే కాకుండా , అష్టావధానశతఘంటకవనాలలో సిద్ధ హస్తులైనారు. ప్రప్రథమంగా  అష్ఠావధాన ,శతావధానరచనాసంవిధానాన్నిఆంధ్ర దేశానికి పరిచయం చేసివిస్తృత ప్రచారం కల్పించినఘనాపాఠి నూజివీడు సంస్థాన విద్వాంసులువిద్వాన్ మాడభూషివెంకటాచార్యుల వారు (1835-1897) 12 ఏళ్ళ బాలుడైన శ్రీరాములు యొక్క ఆశుకవితా పాటవానికి, వ్యస్తాక్షరీ ప్ర్రక్రియలో ప్రతిభకు ముగ్ధుడై ఆశువుగాదాసురామ కవితా లీలాబ్ది నోలలాడితిన్."అంటూ ఈపద్యం చెప్పి ఆశీర్వదించారు
                           "పది రెండేడుల యీడునం గవితఁ చెప్పంబూని వ్యస్తాక్షరీ
                             విదభిఖ్యాతిఁ బొసంగి లేఖ కశత వ్రీడాకరంబైన మే
                             రఁ దుదిన్ బద్యము లల్లి సద్గణిత హోరాశాస్త్రసామర్ధ్యముల్
                             వెదజల్లం దగు దాసురామ కవితా లీలాబ్దినోలలాడితిన్." 

                                 ఆమహనీయుని జయంతి నాడు స్మరించుకుందాము.
జైహింద్.

No comments: