పద్య విపంచిని మీటుచు , సద్యశమును కలుగజేయు చక్కని కృతులన్ , హృద్యంబుగ వ్రాసినచో , విద్యాధికులంత మెచ్చు విశ్వము పొగడున్.
జయ మార్గంబుగ నెంచి నిన్ను మహితుల్ సర్వంబు నీవంచు నీ
పయి భక్తిన్ సతతంబు నిల్పి పరమున్ భాగ్యంబుగా పొందగా
నియతిన్ యత్నము చేయుచుందురు, కృపన్ నీ భక్తులన్ జూచి నీ
ప్రియ భక్తాళికి ముక్తి నిచ్చెదవుగా విశ్వంభరా! శాంభవీ!